![]() |
![]() |

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ ఆదివారం కొత్త కొత్త టాలెంట్స్ తో, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరిస్తోంది. అలా గతంలో "నాన్నే.. నా హీరో" అనే ఒక షో చేసింది. ఆ ఎపిసోడ్ కి చెరిష్ అనే ఒక అనాథాశ్రమానికి చెందిన పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు అందులోని పాపను గుర్తుపట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి, తన బిడ్డను తన దగ్గరకు తెచ్చుకుంది ఒక తల్లి. ఇక ఈ ఎపిసోడ్ లో తప్పిపోయిన సింధు అనే అమ్మాయిని తన తల్లి అనురాధకు అప్పగించింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. రష్మీ మాట్లాడగా అనూరాధ ఎన్నో విషయాలను వెల్లడించారు.
"సింధు మూడేళ్లప్పుడు ఒక అమ్మాయి తనను తీసుకెళ్ళిపోయింది. ఆ వీడియో ఫుటేజ్ కూడా మాకు దొరికింది. ఎన్నో ఏళ్ళు పిల్ల కోసం ఏడ్చాను. ఇక ఎంత వెతికినా దొరక్కపోయేసరికి బాధపడ్డాను. కానీ ఒక రోజు టీవీ పెట్టినప్పుడు 'నాన్నే.. నా హీరో' ఎపిసోడ్ ప్రోమో చూసాం. అందులో సింధు కనిపించింది. వెంటనే తానే నా కూతురు అని అర్థమైపోయింది. నాకు ఇందు, సింధు అని ఇద్దరు కూతుళ్లు.. వాళ్ళు ట్విన్స్. ఇక తెలిసిన అందరి ద్వారా ప్రయత్నించి నా కూతురిని నా దగ్గరకు తెచ్చుకున్నాను. నా దగ్గరకు వచ్చిన మొదటి రోజు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు చాలా బాధేసింది. తెలిసిన వాళ్ళు చెప్పగా, ఫొటోస్ అవన్నీ చూపించగా అప్పుడు గుర్తుపట్టి నాతో మాట్లాడం మొదలు పెట్టింది" అని చెప్పి ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యింది.
ఇక ఇలాంటి గొప్ప షోలో తాము కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రష్మీ, వర్ష భావోద్వేగంతో చెప్పారు.
![]() |
![]() |